విశాఖలో మరో ప్రమాదం

Advertisement

ఏపీ లోని విశాఖను ప్రమాదాలు వణికిస్తున్నాయి. తాజాగా మరోక ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కొన్ని రోజుల క్రితం విశాఖ పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన అందరికి తెలిసిందే.. ఈ ఘటన నుండి కోలుకోముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురి అయ్యింది. అలాగే మరో నౌకలో మంటలు అంటుకున్నాయి. నౌకలోని ఇంజిన్ రూమ్‌లో మంటలు సంభవించినట్లు తెలిసింది. వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్‌లో నౌకలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం వస్తుంది. వెంటనే కోస్ట్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాగే నిన్న ఫిషింగ్ హార్బర్‌లో కూడా ప్రమాదం జరిగింది. ఓ చేపల బోటుకు మంటలు అంటుకున్నాయి. సముద్రంలో ప్రయాణిస్తుండగానే బోటుకు మంటలు అంటుకోవడంతో ఆ బోటు తగలబడింది.కానీ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు మత్స్యకారులు ఉన్నారు. ప్రమాద విషయాన్నీ గమనించి వారు వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆ మంటలను చూసిన ఇతర బోట్ల ఉన్నవారు వెంటనే అక్కడకు వెళ్లి మంటలు ఆర్పే చర్యలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here