మరో 348 మంది పోలీసులకు కరోనా

Advertisement

కరోనా ఎవ్వరిని వదలడం లేదు. సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే దింట్లో చాలా వరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. అలాగే ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది ఇలా ఉంటె కరోనా పోలీసులను కూడా వదలడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర పోలీసులపై కరోనా పంజా విసురుతుంది.

అయితే గత 24 గంటల్లో రాష్ట్రంలో 348మంది పోలీసులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక దింట్లో ఒకరు మరణించారు. దీనితో రాష్ట్ర పోలీసు శాఖలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 177కు చేరుకుంది. ఇప్పటివరకు పోలీసు శాఖలో 17,439 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇందులో 3,225 యాక్టివ్ కేసులు ఉండగా, 14,037 మందికి పూర్తిగా కోలుకొని డిశ్చార్చి అయ్యారని పోలీస్ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here