Andrey Botikov : హత్నకు గురి అయిన కోవిడ్ వ్యాక్సిన్ శాస్తవ్రేత్త.. అంతు చిక్కని కారణం
NQ Staff - March 4, 2023 / 05:45 PM IST

Andrey Botikov : ప్రపంచంలో అన్ని దేశాల కంటే తామే ముందు కరోనా వ్యాక్సిన్ తయారు చేశాం అంటూ రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ ఎంతో మెరుగ్గా పని చేస్తుందంటూ రష్యా అధికారికంగా వెల్లడించింది.
ఆ వ్యాక్సిన్ సృష్టికర్తల్లో ఒక్కడైనా ఆండ్రీ బొటికోవ్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. మాస్కో లోని తన అపార్ట్మెంట్ లో అతడు శవం అయి కనిపించడంతో సన్నిహితులు మరియు దేశ పౌరులు షాక్ కి గురి అవుతున్నారు.
ఈ హత్య కేసులో ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 47 ఏళ్ల బొటికోవ్ అత్యంత ప్రమాదకరమైన కరోనా కి వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాడు. ఎన్నో విప్లవాత్మక పరిశోధనల్లో పాలుపంచుకున్నాడు.
అలాంటి బోటికోవ్ మరణం రష్యా దేశానికి తీవ్రంగా నష్టాన్ని చేకూరుస్తుందని ఆ దేశ ప్రతినిధులు అంటున్నారు. బొటికోవ్ ని 29 ఏళ్ల యువకుడు చంపాడు అనే అనుమానం వ్యక్తం అవుతుంది. పోలీసులు ఆ యువకుడిని విచారిస్తున్నారు, ఎందుకు అతడు బోటికోవ్ ని చంపాడు అనేది తెలియాలంటే విచారణ పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.