Hanuma Vihari : వైరల్ : చేయి విరిగినా బ్యాటింగ్ ఆపని క్రికెటర్
NQ Staff - February 3, 2023 / 02:55 PM IST

Hanuma Vihari : ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ లో భాగంగా మధ్య ప్రదేశ్ తో మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా హనుమ విహారి ఎడమ చేతికి గాయమైంది.
దాంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హార్ట్ గా వెను తిరిగి ఫెవిలియన్ కి చేరాడు. మ్యాచ్ లో మళ్లీ తొమ్మిదవ వికెట్ కి బరిలోకి దిగిన హనుమ విహారి మెల్ల మెల్లగా ఆడుతూ మంచి పరుగులు సాధించాడు.
రెండో ఇన్నింగ్స్ లో మళ్ళీ హనుమ విహారి బరిలోకి దిగి ఒక్క చేతితోనే బ్యాటింగ్ చేశాడు. ఒక్క చేత్తో బ్యటింగ్ చేసినా కూడా అతడి ఆట తీరకు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 16 బంతుల్లో 15 రన్స్ చేశాడు.
అందులో మూడు ఫోర్స్ ఉండడం విశేషం. ఒక చేత్తో కొట్టిన రివర్స్ స్వీట్ షాట్ ఫోర్ పోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. ప్రస్తుత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి ఒక్క చేత్తో క్రికెట్ ఆడి తెలుగు క్రికెటర్ గా ప్రతిభ చాటాడు. అతడు యొక్క పట్టుదలను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
One of the crazy shot ever, wrist injury, batting with one hand and Vihari played this shot. pic.twitter.com/AuHbqNiMZB
— Johns. (@CricCrazyJohns) February 2, 2023