Governor Harichandan : ఏపీ గ‌వ‌ర్న‌ర్‌కి క‌రోనా పాజిటివ్.. ఆరోగ్యంపై ఆరాలు తీస్తున్న జ‌గ‌న్

Governor Harichandan : ఏపీ గవర్నర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు గత రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయగ స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి తెలింది. దీంతో గవర్నర్‌ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించి గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Andhra Pradesh governor Harichandan tested Covid-19
Andhra Pradesh governor Harichandan tested Covid-19

ఈ నెల 15న వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐజీ వైద్యులు తెలిపారు.

గవర్నర్‌ అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.

గవర్నర్‌ ఆరోగ్యంపై సీఎం జగన్‌ ఆరా తీశారు. ఏఐజీ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి.. గవర్నర్‌కు అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు సీఎంకు వివరించారు.

ఏపీ గవర్నర్‌ ఆరోగ్యం బాగుండాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆకాక్షించారు. బిశ్వభూషణ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బిశ్వభూషణ్‌ త్వరగా కోలుకుని దేశానికి సేవచేయాలని పేర్కొన్నారు.