Andhra Pradesh : గొడవపడడం తప్ప వాళ్ళ గోడు పట్టదు – వీళ్ళు లీడర్లు ఏంటి వాళ్ళ ఖర్మ కాకపోతే.

Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది అన్నా విషయం అందరికి తెలిసిందే. అయినకాడికి అప్పులు తెచ్చేసి రాష్ట్రాన్ని ఆర్ధిక క్షోభంలో ముంచేశారు. ఏపీ విభజన తరువాత గత ప్రభుత్వం 5 ఏళ్ళలో లక్షా 25 వేల కోట్లు అప్పు చేస్తూ, ఇప్పటి ప్రభుత్వం ఏకంగా 19 నెలల్లోనే సరికొత్త రికార్డు సృషించినది.సరే తెస్తే తెచ్చారు అప్పు… మరి ఎమన్నా ఆదాయం పెంచుతున్నారా అంటే అది లేదు.గొప్పలకు పోయి అప్పులు తేవడం అంటే ఇంతే కాబోలు. అయితే మన రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి మరి దారుణంగా ఉందని వాపోతున్నారు ఉద్యోగస్తులు. ఉద్యోగస్తులకు, పదవీ విరమణ చేసిన వారికి సరైన సమయానికి జీతాలు, పెన్షన్లు ఒక్కో నెల ఒక్కో విధంగా, వస్తున్నాయి. సాంకేతిక సమస్యలు అని ప్రతి సారి సాకు చెప్పి తప్పించుకుంటున్నారు.

Conflicts Between AP employees And Leaders ఆంధ్రప్రదేశ్
Conflicts Between AP employees And Leaders

ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంగతి అయితే చెప్పే పనే లేదు. చాలా మందికి రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందటం లేదు.ఈ రోజు ఒక పత్రికలో వచ్చిన కధనం ప్రకారం ఇలాంటి బిల్లులు దాదాపుగా వెయ్యి కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.పీఎఫ్ డబ్బులు ప్రభుత్వం నుంచి రాకపోవటంతో, మళ్ళీ బయట అప్పులు తెచ్చుకుని, ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రతి నెలా మొదటి తారీఖున వచ్చే పెన్షన్, ఇప్పుడు రెండు వారాల దాక పడుతుందని వాపోతున్నారు. అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఏమిటో చెప్పే వారు లేరని, పెన్షన్ దారులు వాపోతున్నారు.

ఈ సమస్యలు అన్నిటి పై చర్చించటానికి, నిన్న చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో తమ సమస్యలకు పరిష్కారం చూపాలిసిందిగా ఉద్యోగ సంఘాల నాయకులు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు హాజరు అయ్యారు. అయితే ఎవరికీ వారు ఒక్కళ్లపై ఒకళ్ళు నిందలు వేసుకోవడమే సరిపోయింది. వారి ఇరువురికి సర్ది చెప్పి సజ్జల మళ్ళీ సాంకేతిక సమస్యలే కారణం అని చెప్పి , తొందర్లోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి వెళ్ళిపోయారు.నిజంగానే సాంకేతిక సమస్యలా.. లేక ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది.. !!

Advertisement