Anchor Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె తల్లి కన్నుమూత..!
NQ Staff - January 27, 2023 / 11:32 AM IST

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో ఇప్పుడు అత్యంత విచారకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆమె తల్లి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపింది. తన తల్లి చనిపోయినట్టు చెబుతూ ఎమోషనల్ అయిపోయింది. తన తల్లితో పాటు దిగిన ఫొటోను పోస్టు చేస్తూ ఈ విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది.
నా శ్వాసలో ఉంటావు..

Anchor Vishnu Priya Mother Breathed Her Last
అమ్మ.. ఈ రోజు దాకా నాకు తోడుగా ఉన్నందుకు థాంక్స్. నా చివరి శ్వాస ఉన్నంత వరకు నీ పేరు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు అనంత విశ్వంలో కలిసిపోయావు. నా ప్రతి చోట, నా ప్రతి శ్వాసలో నువ్వు నాతోనే ఉంటావు.
రెస్ట్ ఇన్ పీస్ అమ్మ అంటూ ఎమోషనల్ అయిపోయింది విష్ణుప్రియ. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమె కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. విష్ణుప్రియ స్ట్రాంగ్ గా ఉండాలంటూ కోరుతున్నారు. ఇక కెరీర్ పరంగా ఇప్పుడు బిజీగా ఉంది విష్ణుప్రియ. ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది.