Anchor Vishnu Priya : మూడేండ్లకే వదిలేసినా.. ఎట్టకేలకు తండ్రి వద్దకు చేరిన విష్ణుప్రియ..!
NQ Staff - June 22, 2023 / 10:36 AM IST

Anchor Vishnu Priya : యాంకర్ గా విష్ణుప్రియకు మంచి క్రేజ్ ఉంది. ఆమె అందాలకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. అయితే బుల్లితెరపై ఆమెకు హోస్ట్ గా చేసే అవకాశాలు పెద్దగా రావట్లేదు. కానీ వెండితెరపై మాత్రం బాగానే ఛాన్సులు పడుతోంది ఈ భామ. వరుసగా అక్కడ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
కాగా రీసెంట్ గానే ఆమెకు ఓ షాక్ తగిలింది. అదేంటంటే.. ఆమె తల్లి చనిపోయింది. దాంతో ఒంటరి అయిన విష్ణుప్రియ.. ఇప్పుడు మళ్లీ నాన్న దగ్గరకు చేరింది. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా నేను నాన్న అనే స్పెషల్ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో తండ్రితో పాటు హాజరయింది విష్ణుప్రియ.
ఈ సందర్భంగా ఆమె కొన్ని ఎమోషనల్ కామెంట్లు చేసింది. మా అమ్మానాన్న మూడేండ్ల సమయంలోనే విడిపోయారు. అప్పటి నుంచి నేను అమ్మ దగ్గరే పెరిగాను. నాన్న ప్రేమను చూడలేదు. కానీ రీసెంట్ గా మా అమ్మ చనిపోయింది. దాంతో మళ్లీ మా నాన్న నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూస్తున్నాను.
మా అమ్మా నాన్నలు విడిపోయినప్పుడు వారిని నేను చాలా ద్వేషించాను. కానీ వారు ఎందుకు అలా చేశారో నాకు అర్థం కాలేదు. నా ప్లేస్ లో మీరు ఉంటే వారిని ద్వేషించకండి. వారిని అర్థం చేసుకోండి అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది విష్ణుప్రియ. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్అ వుతున్నాయి.