Syamala: శ్యామల భర్త రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ విలనేనా?..

Syamala: యాంకర్, టీవీ సీరియల్-సినీ ఆర్టిస్ట్ శ్యామల భర్త నర్సింహారెడ్డి ఒక మహిళను ఘోరంగా చీట్ చేశాడంట. ఆమె దగ్గర నాలుగేళ్ల కిందట ఏకంగా కోటి రూపాయలు తీసుకొని మోసం చేశాడని వార్తలు వస్తున్నాయి. డబ్బులివ్వు అని అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడు. లైంగిక వేధింపులకు కూడా గురిచేశాడు. ఈ విషయాలను బాధితురాలే స్వయంగా పోలీసులకు వెల్లడించారు. దీంతో నర్సింహారెడ్డిపై హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగంలో మరో మహిళ జోక్యం చేసుకొని, ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. బాధితురాలు సదరు మహిళ పైన సైతం కంప్లైంట్ ఇవ్వటంతో పోలీసులు ఆమెనూ అరెస్ట్ చేశారు. ఈ విషయం ఇవాళ మంగళవారం మధ్యాహ్నం వెలుగు చూసింది.

రీల్ లైఫ్ లోనూ..

శ్యామల భర్త నర్సింహారెడ్డి కూడా టీవీ సీరియల్ ఆర్టిస్టే. ఎక్కువగా విలన్ కేరక్టర్లు వేస్తుంటాడు. రీల్ లైఫ్ లో పోషించిన పాత్రనే రియల్ లైఫ్ లోనూ పోషించినట్లు తాజా సంఘటనను బట్టి తెలుస్తోంది. శ్యామలకు ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. ఆమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్-2లో మెరిసింది. కాకపోతే నర్సింహా రెడ్డికే ఛాన్స్ లు తక్కువగా వస్తున్నట్లున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేక, అలాగని సమాధానం కూడా చెప్పుకోలేక నర్సింహారెడ్డి ఫ్రస్టేషన్ లో బాధితురాలిని బెదిరించినట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లో..

శ్యామల దంపతులు రాజకీయాల్లోనూ చురుకుగానే పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీలో కనిపించేవారు. మొన్నీమధ్యే వైఎస్ షర్మిలను కూడా వీళ్లిద్దరూ లోటస్ పాండ్ నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. దీంతో శ్యామల దంపతులు షర్మిల పార్టీలో చేరతారేమో అని అందరూ అనుకున్నారు. ఈ లోపు నర్సింహారెడ్డి ఈ వివాదంలో చిక్కుకోవటం పొలిటికల్ గా ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. భర్త వల్ల శ్యామలకు కూడా చెడ్డ పేరు వచ్చింది. ప్రతి మీడియాలోనూ శ్యామల భర్త అనే వార్తలు రాస్తున్నారు తప్ప నర్సింహా రెడ్డి అని రాయట్లేదు. నర్సింహా రెడ్డి అంటే ఎవరికీ తెలియదు. శ్యామల భర్త అంటే తేలిగ్గా తెలిసిపోతుంది.

Advertisement