Anchor Sreemukhi Comments On Anasuya Bharadwaj : ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని చేయను.. అనసూయపై శ్రీముఖి దుమారం రేపే కామెంట్లు..!

NQ Staff - July 3, 2023 / 12:33 PM IST

Anchor Sreemukhi Comments On Anasuya Bharadwaj  : ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని చేయను.. అనసూయపై శ్రీముఖి దుమారం రేపే కామెంట్లు..!

Anchor Sreemukhi Comments On Anasuya Bharadwaj  :

శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై వరుస ప్రోగ్రామ్స్ తో దూసుకుపోతోంది. ఆమె చేతిలో ఉన్నన్ని అవకాశాలు ఇంకెవరి చేతుల్లో లేవు. దాదాపు అన్ని ఛానెళ్లను కవర్ చేస్తోంది. ఇటు బుల్లితెరపైనే కాకుండా అటు ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. ఇలా చేతినిండా అవకాశాలతో బాగానే సంపాదిస్తోంది.

ఇలా ఆమెకు పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని కొందరు సినిమాల్లో ఛాన్సులు కూడా ఇస్తామని చెబుతున్నారంట. ఈ విషయాలను తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. ఇప్పుడు సినిమాల్లో బాగానే ఛాన్సులు వస్తున్నాయి. కానీ నా క్యారెక్టర్ జనాలకు గుర్తుండిపోవాలి అనుకుంటున్నాను.

ఐటెం సాంగ్స్ చేయను..

అందుకే ఏది పడితే అది చేయట్లేదు అని తెలిపింది శ్రీముఖి. ఇప్పుడు టీవీ యాంకర్లు కొందరు బోల్డ్ గా నటిస్తున్నారు, ఐటెం సాంగ్స్ కూడా చేస్తున్నారు.. మీరు అలాంటి ఆఫర్లు వస్తే చేస్తారా అని అడగ్గా.. శ్రీముఖి చేయను అని చెప్పేసింది. నాకు ఇప్పుడు డబ్బులు ముఖ్యం కాదు.

మంచి పాత్రలు చేయాలని ఉంది. అంతే గానీ బోల్డ్ పాత్రలు చేయను. ఎంత డబ్బులిచ్చినా అలాంటివి చేయడానికి నేను రెడీగా లేను. ఇక ఐటెం సాంగ్స్ నాకు సూట్ కావు. కాబట్టి జనాలకు గుర్తుండిపోయే పాత్రలు వస్తే మాత్రం కచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను అంటూ తెలిపింది శ్రీముఖి.

అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లు అనసూయను ఉద్దేశించే ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే యాంకర్లలో కేవలం అనసూయ మాత్రమే బోల్డ్ పాత్రలు, ఐటెం సాంగ్స్ చేస్తోంది. కాబట్టి అలా చేయను అని చెప్పడంతో శ్రీముఖిని అంతా అభినందిస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us