Anchor Sreemukhi : ఆ హీరో ఒప్పుకుంటే పెండ్లి చేసుకుంటా.. శ్రీముఖి సెన్సేషనల్..!
NQ Staff - June 10, 2023 / 11:55 AM IST

Anchor Sreemukhi : బుల్లితెరపై పటాస్ లాగా పంచులు పేలుస్తూ ఉంటుంది శ్రీముఖి. ఆమె ఇప్పుడు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రీముఖి చేస్తున్నన్ని షోలు ఇంకెవరూ చేయట్లేదనే చెప్పుకోవాలి. ఆమె చేతిలో నాలుగైదు షోలు ఉన్నాయి. ప్రస్తుతం స్టార్ మా, ఈటీవీ, జీ న్యూస్ ఇలా అన్ని ఛానెళ్లు తిరుగుతోంది.
అయితే ఆమెకు మూడు పదుల వయసు దాటిపోతున్నా సరే ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్ లతో బిజీగా ఉంది. అదే సమయంలో ఆమెకు సినిమాల్లో ఛాన్సులు వచ్చినా చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఆమె స్టార్ మా పరివార్ షోలో పాల్గొంది.
ఇందులో బుల్లితెర ఆర్టిస్టులు తమ భార్యలతో కలిసి వచ్చారు. ఇందులో వారు తమ భార్యలతో కాస్త గొడవ పడుతున్నట్టు ఫన్నీగా ఆటలు ఆడారు. అయితే ఓ సమయంలో నీకు పెండ్లి వద్దా అని ఫైమా అడిగింది. దానికి శ్రీముఖి మాట్లాడుతూ.. నా అందానికి ఏ హీరో సెట్ అవుతాడా అని అడుగుతుంది.
ప్రభాస్ ఒక్కడే సింగిల్ గా ఉన్నాడని ఫైమా చెప్పడంతో.. ఆయన ఒప్పుకుంటే ఎగిరి గంతేసి చేసుకుంటా అంటూ చెబుతంది. ఎక్కడా కలలోనా అంటూ ఫైమా పంచ్ వేస్తుంది. ఇలా ఆద్యంతం వారి షో నవ్వులు పూయించింది. అయితే శ్రీముఖికి ప్రభాస్ ను పెండ్లి చేసుకోవాలని ఉందని ఇలా బయట పెట్టిందన్నమాట.