Anchor Rashmi Gautam Social Media Tweet Viral : వాడు రేపిస్ట్.. అతని నుంచి కాపాడండి.. యాంకర్‌ రష్మీ పోస్టు వైరల్..!

NQ Staff - July 11, 2023 / 09:41 AM IST

Anchor Rashmi Gautam Social Media Tweet Viral : వాడు రేపిస్ట్.. అతని నుంచి కాపాడండి.. యాంకర్‌ రష్మీ పోస్టు వైరల్..!

Anchor Rashmi Gautam Social Media Tweet Viral :

యాంకర్ గా రష్మీకి ఎంతటి క్రేజ్ ఉందనేది అందరికీ తెలిసిందే. ఆమె ఇప్పుడు బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలు కూడా చేస్తోంది. దాంతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇలా అటు వెండితెర, ఇటు బుల్లితెర మీద బాగానే రాణిస్తోంది. ఇలా రెండు చేతులతో బాగానే సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఆమె పెట్ లవర్ అనే విషయం కూడా మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆమె మూగ జీవాల గురించి పోస్టులు పెడుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి యాంకర్ గా రష్మీ  ఇలాంటి పోస్టు పెట్టింది. తాజాగా ఓ వ్యక్తి పెట్ డాంగ్ ని హింసిస్తున్న వీడియో సోషల్ మీడియాలోట్ డాంగ్ ని హింసిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని రష్మీ చూసింది.

వారిని ట్యాగ్ చేస్తూ..

ఇంకేముంది ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది. ఈ ట్వీట్ లో ఢిల్లీ పోలీసులు, పెటా సంస్థ, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను సదరు ట్వీట్ లో ట్యాగ్ చేస్తూ వారిని కోరింది. అతను చాలా ప్రమాదకరంగా ఉన్నాడు.

అలాంటి వ్యక్తి వల్ల కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదమే. చిన్నారులను లైంగికంగా వేధించే వాడు రేపిస్ట్ అవుతాడు. కాబట్టి అతనిపై చర్యలు తీసుకోండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. రష్మీ గౌతమ్ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇలాంటి ట్వీట్లు ఆమె గతంలో బాగానే పోస్టు చేసింది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us