Anchor Rashmi Gautam About Responded Future Husband : నాకు కాబోయే భర్త అలా ఉండాలంటున్న యాంకర్ రష్మీ.. నెట్టింట వైరల్!

NQ Staff - July 17, 2023 / 07:38 PM IST

Anchor Rashmi Gautam About Responded Future Husband : నాకు కాబోయే భర్త అలా ఉండాలంటున్న యాంకర్ రష్మీ.. నెట్టింట వైరల్!

Anchor Rashmi Gautam About Responded Future Husband :

ఈటీవీ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు.. జబర్దస్త్ తర్వాత ప్రోగ్రామ్స్ చేయడంతో ఈటీవీకి సాటి మరే ఛానెల్ రాదు అనేంతలా పాపులర్ అయ్యింది. ప్రతీ ఫెస్టివల్ కు ఒక ప్రోగ్రాం చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తుంది. అంతేకాదు ఒక్కో సారి ఒక్కో థీమ్ తో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ తో పాటు అప్పుడప్పుడు భావోద్వేగాలతో కూడిన ప్రోమోలు కూడా రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ ను ఈటీవీకి అతుక్కుపోయేలా చేస్తున్నారు.

మరి ఇప్పుడు ప్రసారం అవుతున్న షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి.. ఈ షో వారం వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో అలరిస్తూనే ఉంటుంది.. మరి తాజాగా జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సీరియల్ యాక్టర్స్ అంతా తమకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాలు తెలిపారు.. ఈ సందర్భంగా యాంకర్ రష్మీ కూడా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయం మీద కామెంట్స్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

టాప్ యాంకర్ లలో ఒకరిగా దూసుకు పోతున్న యాంకర్ రష్మీ అటు జబర్దస్త్ చేస్తూ ఇటు శ్రీదేవి డ్రామా కంపెని షోకు కూడా హోస్ట్ గా చేస్తూ బిజీ బిజీగా ఉంది. మరి తాజా ఎపిసోడ్ లో వారికే కాబోయే భర్తలు ఎలా ఉండాలి అనే విషయం మీద అంతా కామెంట్స్ చేసారు. ఈ ఎపిసోడ్ కు ఈ ఘట్టం హైలెట్ గా నిలిచింది.

ఇందులో రష్మీ మాట్లాడుతూ.. తన భర్త ఆయన మాటలు యాక్షన్స్ లో చూపించాలి.. యాక్షన్స్ కు మాటలు సింక్ అవ్వాలి అనగానే హైపర్ ఆది వాడు పక్క ఛానెల్ లో ఉండాలి అంటూ సుధీర్ ప్రస్తావన తెచ్చాడు. ఆ తర్వాత రష్మీ చెప్పింది చెయ్యాలి.. చేసేది చెప్పాలి.. అనగానే వాడు చేసేవన్నీ చెబితే నువ్వు భరించలేవు అంటూ మళ్ళీ సెటైర్ వేయగా ఈ ఎపిసోడ్ మొత్తం ఆద్యంతం అలరించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us