Anchor Pradeep : సర్ ప్రైజ్.. పవన్ కల్యాణ్ సినిమాకు నిర్మాతగా యాంకర్ ప్రదీప్..!
NQ Staff - May 31, 2023 / 12:11 PM IST

Anchor Pradeep : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేంజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇమేజ్ కు ఇప్పుడు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు. ఆయన ఒక్క రోజుకు ఏకంగా రూ.2 కోట్లు తీసుకునే స్థాయిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ఇదంతా పవన్ కు ఉన్న బలమైన ఫ్యాన్ బేస్ అనే చెప్పుకోవాలి.
అలాంటి పవన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోల కంటే స్పీడుగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు పవర్ స్టార్. అయితే పవన్ తో సినిమాలు చేసేందుకు ఎంతో మంది పెద్ద నిర్మాతలు కూడా వెయిట్ చేస్తుంటారు.
కానీ అది అందరికీ దక్కే అవకాశం కాదు. కానీ ఇప్పుడు యాంకర్ ప్రదీప్ ఈ వరుసలోకి వచ్చాడు. ఆయన యాంకర్ గా చాలా ఫేమస్. అలాంటి ప్రదీప్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. నేను యాంకర్, హీరోగా కూడా ట్రై చేశాను. కానీ నిర్మాతగా కూడా చేయాలని ఉంది.
నా మొదటి సినిమాను పవన్ కల్యాణ్ తోనే చేయాలని ఎంతో ఆశగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్. ఒక యాంకర్ అయిన ప్రదీప్.. పవన్ సినిమాకు వంద కోట్ల వరకు బడ్జెట్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తుంటే ప్రదీప్ బాగానే సంపాదించినట్టు తెలుస్తోంది.