Pradeep: ఆ భయంతోనే షూటింగ్‌కు వెళ్లేవాడిని.. యాంకర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్

Anchor Pradeep about 30 Rojullo Preminchadam Ela
Anchor Pradeep about 30 Rojullo Preminchadam Ela

Pradeep ప్రతీ ఒక్కరికి వెండితెర పై వెలగాలని ఎదిగిపోవాలనే కోరిక ఉంటుంది. అయితే వెండితెరపై హీరోగా కనిపించడం అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. అదంత సులభమైన పనేమీ కాదు. అలా తాను పదేళ్లు ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చానని యాంకర్ ప్రదీప్ చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు బుల్లితెర పై సత్తా చాటిన ప్రదీప్.. ఇకపై వెండితెరపై హీరోగా మెప్పించేందుకు వస్తున్నాడు.

ప్రదీప్ హీరోగా వస్తోన్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా విడుదలకు సిద్దంగా ఉంది. అసలే ఏడాది క్రితమే విడుదల కావాల్సి వచ్చిన ఈ చిత్రం ఇలా రేపు విడుదలకు సిద్దంగా ఉంది. కరోనా, లాక్డౌన్ వల్ల వాయిదా పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టాడు ప్రదీప్. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రదీప్ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

ఆ భయంతో అంటోన్న యాంకర్ ప్రదీప్ Pradeep
హీరోగా సినిమా తెరకెక్కిస్తోన్న సమయంలో.. అసలు నేను హీరోగా మెప్పించగలనా..? వారిని నవ్విస్తానా..? లేదా.? అనే భయాలతోనే ప్రతిరోజూ షూటింగ్‌కు వెళ్లే వాడినని చెప్పుకొచ్చాడు. దర్శకనిర్మాతలు తనపై పెట్టుకున్న నమ్మకం వల్లే ఈ సినిమా చేయగలిగానని ప్రదీప్ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా ప్లాన్స్ చేశాడు. టాప్ యాంకర్లైన అనసూయ, శ్రీముఖి, రష్మీలను పట్టుకొచ్చి ప్రమోషనల్ సాంగ్ చేయించాడు. అది బాగానే క్లిక్ అయింది. ఇక నీలి నీలి ఆకాశం అనే పాట ఎలాగూ సంచలనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక రేపు ప్రదీప్ భవితవ్యం ఏంటో తెలిసిపోనుంది.

Advertisement