బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్

Advertisement

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఇక ఇండియాలో సైతం కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఊపు మీద ఉంది ఈ మహమ్మారి. అయితే ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. అదే తరుణంలో తాజాగా హాస్య నటుడు, యాంకర్ బిత్తిరి సత్తికి కరోనా సోకింది. సత్తికి కరోనా లక్షణాలు ఉండడంతో టెస్టులు చేయించున్నాడు. అయితే టెస్టులకు గల రిపోర్టులు రావాల్సి ఉంది. కానీ తనకు ఉన్న లక్షణాలు చూస్తుంటే కరోనా ఉందనే అభిప్రాయపడుతున్నాడు.

అయితే బిత్తిరి సత్తి తాజాగా టీవీ 9 ఇస్మార్ట్ వార్తల నుండి తప్పుకున్నాడు. దీనితో సాక్షి టీవీలో గరం గరం వార్తలు అనే షో చేస్తున్నాడు. అలాగే సత్తితో పాటు గరం గరం వార్తల షో టీం మొత్తానికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇక సత్తి బుధవారం ప్రసారమైన గరం గరం వార్తల షోలో ఇంట్లో హోం ఐసొలేషన్ లో ఉండి తన వీడియో ను పంపాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here