చీరలు జాకెట్లు కుట్టి మా అమ్మ నన్ను పెంచింది అనసూయ రియల్ స్టోరీ

Advertisement

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలియని వారు అంటూ ఎవ్వరు ఉండరు. ఎందుకంటె అటు బుల్లితెర మీద తన యాంకరింగ్ తో మరియు తన అందంతో అందరి మనుసులు దోచుకుంటూ ఉంటుంది అనసూయ. అలాగే వెండితెర మీద కూడా తాను ఏంటో నిరూపించుకుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తో అందరి మనుసులు దోచేసింది. అయితే ఎప్పుడు ఆనందంగా కనిపించే అనసూయ గతానికి వెళితే, చాలా ఒడిదొడుకులు పడి ఈ రోజు ఈ స్థాయిలో ఉందంట.

అయితే తాజాగా ఓ ఇంటర్ వ్యూ లో పాల్గొన్న అనసూయ తన కష్టాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టింది. అయితే ఒకానొక సమయాన తన తల్లి జాకెట్లు, చీర ఫాల్స్, కుట్టి అనసూయకు తన ఇద్దరు చెల్లళ్ళకు బట్టలు కొనేది అని చెప్పుకొచ్చింది. అలాగే తమకు ఉన్న ఇబ్బందులతో సకాలంలో ఇంటి రెంట్ కట్టకపోయే సరికి, చాలా ఇండ్లు మార్చవలసి వచ్చేది అని తన గతాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టింది అనసూయ భరద్వాజ్.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here