ANASUYA: కేర‌ళలో ఫుల్ చిల్ అయిన అన‌సూయ‌.. వీడియో షేర్ చేసి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన ముద్దుగుమ్మ‌

అందాల ముద్దుగుమ్మ అన‌సూయ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటుంది. గ్లామ‌ర్ షోతోనో లేదంటే కాంట్ర‌వర్సీస్‌తోనో లేదంటే సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ తోనో ప్ర‌తి రోజు నెటిజ‌న్స్‌కు ట‌చ్‌లో ఉంటూ వ‌స్తుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ కేర‌ళ టూర్‌కు వెళ్లింది. త‌న భ‌ర్త పిల్ల‌ల‌తో క‌లిసి షికారుకి వెళ్లొచ్చిన అన‌సూయ మెల్ల‌గా అక్క‌డ చేసిన హంగామాకు సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా అన‌సూయ కేర‌ళో చిల్ అవుతున్న వీడియో ఒక‌టి షేర్ చేయ‌గా, ఇది నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

అన‌సూయ కెరీర్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం బుల్లితెర‌తో పాటు వెండితెరతో బిజీగా ఉంది. రీసెంట్‌గా చావు క‌బ‌రు చ‌ల్ల‌గా అనే చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అన‌సూయ‌.. ర‌వితేజ ఖిలాడిలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇట‌లీకు కూడా వెళ్లింది. అక్క‌డ దిగిన ప‌లు ఫోటోలు, చేసిన సంద‌డికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ర‌చ్చ చేసింది. ఖిలాడీలో అన‌సూయ పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ పూర్తైన‌ట్టు తెలుస్తుండ‌గా , ప్ర‌స్తుతం రంగ‌మార్తాండ‌, పుష్ప సినిమాల‌తో బిజీగా ఉంది.

 

Advertisement