Anasuya Bhardwaj : అనసూయా.! నీకీ ‘కెలుకుడు’ అవసరమా.! తిక్క కుదిరిందా.?

NQ Staff - August 31, 2022 / 07:35 PM IST

Anasuya Bhardwaj  : అనసూయా.! నీకీ ‘కెలుకుడు’ అవసరమా.! తిక్క కుదిరిందా.?

Anasuya Bhardwaj  : వివాదాల్లో ఇరుక్కోవడం అనసూయకు కొత్తేం కాదు. కానీ, క్రేజ్ ఓ రేంజ్‌లో వున్నప్పుడు అవన్నీ కొట్టుకుపోయాయ్. కానీ, ఇఫ్పుడు అనసూయ క్రేజ్ కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పాలేమో. అన్ని సమయాల్లోనూ ఎగిరెగిరి పడితే, పరిణామాలు ఇలాగే వుంటాయ్ మరి.

‘లైగర్’ సినిమా ఫ్లాప్‌ని తాను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నా.. అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ని కెలికి పబ్లిసిటీ మూట కట్టుకోవాలనుకుంది అనసూయ. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ ట్వీట్ల వర్షం కురిపిస్తూ తన ఆనందాన్ని ప్రదర్శించింది.

ఆంటీ అంటే కేసు పెట్టేస్తారా.?

Anasuya Bhardwaj Angered by Industry Bigwigs

Anasuya Bhardwaj Angered by Industry Bigwigs

ఆ క్రమంలోనే ‘ఆంటీ’ అంటూ విజయ్ ప్యాన్స్‌ తనను ట్రోల్ చేస్తున్నారంటూ పోలీసులూ, ఫిర్యాదుల వరకూ వెళ్లి గోటితో పోయే గొడవని గొడ్డలి దాకా తెచ్చుకుంది చేతులారా అనసూయ. ఇప్పుడీ వివాదం కాస్తా ఇండస్ట్రీ పెద్దల ఆగ్రహానికి గురయ్యేంత వరకూ వెళ్లింది.

హీరో ఎవరనేది పక్కన పెడితే, ఓ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడం అనేది పరోక్షంగా, ప్రత్యక్షంగా వేల మంది జీవితాలను ప్రభావితం చేసే సెన్సిటివ్ ఇష్యూ. అక్కడే అనసూయ తప్పు బయట పడిపోయింది.

అనసూయ కూడా ఓ నటియే. ఓ సాధారణ యాంకర్ అయిన అనసూయ ఇండస్ట్రీ ఆదుకోవడం వల్లనే ఇప్పుడీ స్థాయికి ఎదిగింది. ‘లైగర్’ విషయంలో అనసూయ తీరు ఇండస్ర్టీ పెద్దలను కోపానికి గురి చేసింది. దాంతో అనసూయ తన కెరీర్ తానే చేతులారా పాడుచేసుకుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. చూడాలి మరి, ఇంత సీరియస్ అయిన ఈ ఇష్యూని అనసూయ ఆంటీ ఎలా డీల్ చేస్తుందో.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us