Anasuya Bharadwaj : మంచి ఫిజిక్ ఉంటే చూపించుకోవడంలో తప్పేముంది.. అనసూయ దుమారం..!
NQ Staff - June 14, 2023 / 02:14 PM IST

Anasuya Bharadwaj : యాంకర్ గా అనసూయకు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. దాన్ని ఎవరూ కాదనరు. అయితే ఇప్పుడు బుల్లితెరపై ఆమె యాంకర్ గా కొనసాగట్లేదు. ఎక్కువగా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతోంది. సుకుమార్ పుణ్యమా అని సినిమాల్లో పెద్ద నటిగా మారిపోయింది ఈ భామ. రీసెంట్ గానే ఆమె నటించిన విమానం సినిమా రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె అనేక ఆసక్తికర కామెంట్లు చేసింది. విజయ్ దేవరకొండతో వివాదానికి పులిస్టాప్ పెడుతున్నట్టు కూడా ప్రకటించింది. మరికొన్ని విషయాల్లోనూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో మీరు ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక కూడా.. ఇలా పొట్టిబట్టలు వేసుకుని అందాలు ప్రదర్శించడాన్ని మీరెలా చూస్తారు అని అడిగారు.
దానికి ఆమె స్పందిస్తూ.. మంచి ప్రశ్న అడిగారు. ఆడవారికి దేవుడు ఇచ్చిన వరం అందం. నేను ఒక తల్లిగా నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. ఇటు నటిగా కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నదంతా గ్లామర్ ఫీల్డ్. కాబట్టి ఉన్న సిచ్యువేషన్ కు తగ్గట్టు మనం మారిపోతూ ఉండాలి. అప్పుడే మూవ్ ఆన్ అవుతాం.
ఏ రంగంలో అయినా సరే అమ్మాయిలు అందాలను చూపించుకోవడం అనేది వారి ఇష్టం. అందంగా ఉన్న వారు ఎక్స్ పోజింగ్ చేసుకుంటే అది వారి సొంత నిర్ణయం. ఏదో ఒక అవకాశం అనేది వారి ఆలోచనలో ఉంటుంది.
కాబట్టి దాన్ని తప్పుగా చూడాల్సిన పనిలేదు. జిమ్ లలో గంటల కొద్దీ కష్టపడి ఫిజిక్ మెయింటేన్ చేసేదే చూపించుకోవడానికి కదా అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. కానీ అనసూయ కామెంట్లపై కొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి చెత్త కామెంట్లు చేసి సమాజానికి చెత్త మెసేజ్ ఇస్తున్నావా అంటూ అడుగుతున్నారు.