అన్నింటికీ నో చెప్తున్న అనసూయ

Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలో షో, సీరియల్స్, సినిమాల షూటింగ్ లకు అనుమతులు లభించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులు మరియి కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఎవ్వరు కూడా చెయ్యడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు కొన్ని టీవీ షో లు మరియు సీరియల్స్ సిబ్బంది ధైర్యం చేసి ముందుకు వచ్చినప్పటికీ ఆ యూనిట్ సభ్యులలో ఎవ్వరికో ఒకరికి కరోనా సోకడం తో వాటిని ఆ విధంగానే నిలిపి వేస్తున్నారు.

ఆలా ఇప్పటి వరకు మొదలైన కొన్ని టీవీ సీరియల్స్ మరియు టీవీ షో లను నిలిపివేయడం జరిగింది. అయితే కొన్ని టీవీ సంబంధిత ప్రోగ్రాం లు మాత్రం ఎలాగోలా నడిపిస్తూ ముందుకు నెట్టుకువస్తున్నారు. ఈ తరుణం లో కొంత మంది నటులు మాత్రం షూటింగ్ లకు ససేమిరా నో అని చెప్తున్నారు. తాజాగా తన అందంతో, మాటలతో అందరి ప్రేక్షకులలో మంచి పేరు ని సంపాదించుకొని తెలుగు టాప్ యాంకర లలో కొనసాగుతున్న యాంకర్ అనసూయ

ఇక తాను కూడా ప్రస్తుతం అన్ని షూటింగ్ లకు నో చెప్పేసింది అంట. పూర్తి వివరాలలోకి వెళితే షూటింగ్ లు మొదలవ్వగానే ఈటీవీ మల్లెమాల , మరియు ఇతర షో వాళ్ళు అందరూ తనకు కాల్స్ చేసి అడుగగా షూటింగ్ లకు ఓకే చెప్పేసింది అనసూయ. కానీ షూటింగ్ లు నిర్వహిస్తున్న కొంత మంది సీరియల్ యాక్టర్స్ కె కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగే అమితాబ్ బచ్చన్ కి కూడా కరోనా సోకడం తో వెనిక్కి తగ్గి మరల ఒప్పుకున్న షూటింగ్ ల అన్నింటికీ కూడా నో చెప్పేసింది అంట.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here