Anasuya Bharadwaj : ప్లీజ్ నన్ను వదిలేయండి.. విజయ్ ఫ్యాన్స్ కు అనసూయ రిక్వెస్ట్..!

NQ Staff - June 20, 2023 / 09:49 AM IST

Anasuya Bharadwaj : ప్లీజ్ నన్ను వదిలేయండి.. విజయ్ ఫ్యాన్స్ కు అనసూయ రిక్వెస్ట్..!

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ సినీ కెరీర్ లో చాలా హైట్స్ లో ఉంది. ప్రస్తుతం పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. కెరీర్ పరంగా మంచి పొజీషన్ కు చేరుకుంది. కానీ వ్యక్తిగత విషయాలతో మాత్రం ఎప్పుడూ వివాదాల్లోనే చిక్కుకుంటోంది. మొన్నటి వరకు విజయ్ దేవరకొండ, అనసూయకు మధ్యపెద్ద వారే నడిచింది.

విజయ్ సినిమాలపై అనసూయ పరోక్షంగా సెటర్లు వేయడం.. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెను దారుణంగా ట్రోల్స్ చేయడం లాంటివి జరిగాయి. అయితే ఆమె రియలైజ్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే రీసెంట్ గా విమానం మూవీ ప్రమోషన్స్ లో తాను ఇక వివాదాలకు దూరంగా ఉంటానని తెలిపింది. ఎవరి జోలికి వెళ్లనని తెలిపింది.

ఇక తాజాగా మరోసారి వరుస ట్వీట్స్ తో తన మనసులోని మాటలను బయటపెట్టింది. కొందరు నన్ను రాజకీయ, సినీ పరిశ్రమలోని ఇతరులను అగౌరవ పరిచేందుకు నా పేరును వాడుకుంటున్నారు. ఇది చాలా బాధగా ఉంది. నేను ఎవరినీ అగౌరవ పరచను. దయచేసి ఇలాంటి విషయాల్లోకి నా పేరును లాగకండి.

ప్లీజ్.. నాకు ఫ్యామిలీ ఉంది. నన్ను వదిలేయండి అంటూ అనసూయ రిక్వెస్ట్ పెట్టుకుంది. అయితే ఈ రిక్వెస్ట్ పరోక్షంగా విజయ్ ఫ్యాన్స్ కు పెట్టినట్టు ఉందని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఇంకా ట్రోల్స్ చేయడం ఆపట్లేదంట. అందుకే ఇలాంటి పని చేస్తోందని అంటున్నారు.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us