Anasuya Bharadwaj : మరోసారి అలాంటి పని చేయబోతున్న అనసూయ.. ఇంత షాక్ ఇచ్చిందేంటి..!
NQ Staff - January 26, 2023 / 11:14 AM IST

Anasuya Bharadwaj : అనసూయ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆమె ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా ఆమె బాగా పాపులర్అయిపోయింది. అంతకు ముందు ఆమె న్యూస్ ఛానెల్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే బుల్లితెరమీదకు ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే బాగా పాపులర్ అయిపోయింది.
ఇక దాదాపు ఎనిమిదేండ్ల పాటు జబర్దస్త్ లో చేసిన అనసూయ అక్కడ మానేసింది. కొన్ని రోజులు స్టార్ మాలో చేసిన ఆమె ఇప్పుడు అక్కడ కూడా మానేసింది. అప్పటి నుంచి ఆమెకు పెద్దగా అవకాశాలు అస్సలు రావట్లేదు. అప్పటి నుంచి ఆమె పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.
కొత్త సినిమాతో..
ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఎలాగూ బుల్లితెరపై యాంకర్ గా పెద్దగా అవకాశాలు రావట్లేదు కాబట్టి వెండితెరపై రాణించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆమె ఇప్పుడు ఓ కొత్త సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే ఈ కొత్త సినిమాలో ఆమె పూర్తిగా నెగెటివ్ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాలో ఇప్పటికే నెగెటివ్ రోల్ చేసింది. ఇక కొత్తగా మరో స్టార్ హీరో సినిమాలో కూడా ఇలాంటి నెగెటివ్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఈ విషయమే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.