Anasuya: అన‌సూయ‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. జైల్లో ఊచ‌లు లెక్క‌పెడుతున్న యాంక‌ర‌మ్మ‌

Anasuya: అందం, అభిన‌యం రెండు క‌ల‌గ‌ల‌సిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. యాంక‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన అన‌సూయ ఆ త‌ర్వాత న‌టిగా మంచి మార్కులు పొందింది. ‘క్షణం’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. రంగ‌మ్మ‌త్త‌గా అనసూయ‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దీంతో ఈ అమ్మ‌డికి వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ వ‌చ్చిప‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంది అన‌సూయ‌. ప్రస్తుతం పుష్ప యూనిట్ మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెట్‌లో అనసూయ కూడా అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. జైలు సీన్లకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

అన‌సూయ త‌న స్టోరీలో జైల్లో ఉన్న‌ట్టుగా ఓ ఫోటో షేర్ చేసింది.ఇది చూస్తే కొన్ని జైలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నర‌ని అర్ధ‌మ‌వుతుంది. ఈ సందర్భంగా అనసూయను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారు. అనసూయ జైల్ సీన్స్ ఈ సినిమాలో కీలకం అని చెబుతున్నారు.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయింది. మరోవైపు మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఈ భామను ఎంపిక చేసారు. మరోవైపు అనసూయ భరద్వాజ్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది.

మరోవైపు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు .ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట.