Anasuya: మ్యారేజ్ డే రోజు గొడ‌వ పెట్టుకున్న అన‌సూయ దంప‌తులు

Samsthi 2210 - June 7, 2021 / 05:49 PM IST

Anasuya: మ్యారేజ్ డే రోజు గొడ‌వ పెట్టుకున్న అన‌సూయ దంప‌తులు

Anasuya: అన‌సూయ .. ఈ పేరు తెలుగు రాష్ట్రాల‌లో ఎంత ఫేమ‌స్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా యూత్‌కి ఈ అమ్మ‌డు అంటే పిచ్చి. బుల్లితెర‌కు గ్లామ‌ర్ అద్ది ఇప్పుడు వెండితెర‌పై కూడా వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అన‌సూయ నిత్యం వార్త‌ల‌లోనే ఉంటుంది. ఈ అమ్మ‌డికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ ఉండే అన‌సూయ అప్పుడ‌ప్పుడు విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకొని అన‌సూయ త‌న కెరీర్ స‌జావుగా సాగేలా ప్ర‌ణాళిక‌లు రచిస్తుంది. అన‌సూయ న‌టించిన చావు క‌బురు చల్ల‌గా చిత్రం ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా , ప్ర‌స్తుతం ఖిలాడి, రంగ‌మార్తాండ‌, పుష్ప వంటి చిత్రాల‌లో నటిస్తుంది.

Anasuya

ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన‌ప్ప‌టికీ అన‌సూయ గ్లామ‌ర్ షో విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కాదు. ఇక సుశాంక్ భ‌ర‌ద్వాజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఈ ఏడాది జూన్ 5తో అన‌సూయ‌-సుశాంక్ వైవాహిక బంధానికి 11 సంవ‌త్స‌రాలు నిండాయి. అలానే ప్రేమ‌కు 20 సంవ‌త్స‌రాలు అని అన‌సూయ పేర్కొంది. అన‌సూయ కెరీర్ ఇంత సాఫీగా సాగుతుంది అంటే సుశాంక్ ఇస్తున్న మ‌ద్ద‌తు కూడా అని చెప్ప‌వ‌చ్చు. ఎల్ల‌వేళ‌లా త‌న భార్య‌కు మ‌ద్దతుగా నిలుస్తూ అన‌సూయ విజ‌యంలో స‌గ‌భాగం అయ్యారు సుశాంక్. పెళ్లి రోజు త‌న భర్త భరద్వాజ్ గురించి చెబుతూ తాము గొడవ పడతామని, ఒకరినొక‌రం బాధ‌పెట్టుకుంటామ‌ని పేర్కొంది. అలానే ఇడియాటిక్ విషయాలకు సంబంధించి తాము ఒట్లు వేసుకుంటామని అనసూయ చెప్పుకొచ్చారు.

Anasuya

మా మాధ్య జ‌రిగే కొన్ని గొడ‌వ‌ల వ‌ల‌న ఇద్ద‌రి మ‌ధ్య‌ బంధం రోజు మించి ఉండ‌దేమో అనేలా ఉంటుంది. అయితే గొడ‌వ‌ల క‌న్నా మా మ‌ధ్య ప్రేమ‌, అభిమానం ఎక్కువ అని , భర్త తప్ప తనకు మరో విషయం తెలియదని ఐలవ్యూ అంటూ అనసూయ భర్తపై ప్రేమను చాటుకున్నారు. ఇక మా పెళ్ళి రోజు భ‌ర్తతో కలిసి దిగిన ఫోటోను ఎందుకు పెట్టడం లేదంటే తమ మధ్య గొడవ జరిగిందని అనసూయ అన్నారు. మ‌రి ఏ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌నేది మాత్రం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం అనసూయ‌
జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో పాటు ప‌లు టీవీ షోస్ కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. కాగా, అనసూయ ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్నపుడు ఓ సారి NCC క్యాంప్‌కి వెళ్లింది.. ఆ క్యాంప్‌కి తానే గ్రూప్ కమాండర్ కావడంతో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేంది. అయితే అదే క్యాంప్‌కి వచ్చిన మరో స్టూడెంట్ భరద్వాజ్.. ఈమెని చూసి తన మనసు పారేసుకున్నాడని.. అనుకున్నదే తడవుగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన మనసులో ఉన్న మాటని అనసూయకు చెప్పేసాడట భరద్వాజ్. అలా ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ ప్రేమ పెళ్లిగా మారింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us