Anand Mahindra : బిచ్చ‌గాడి ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన ఆనంద్ మ‌హీంద్రా.. అవకాశం కూడా ఇచ్చాడుగా..!

Anand Mahindra : ఆనంద్ మ‌హీంద్రా.. కోట్లాది ఆస్తుల‌ని కూడ‌బెట్టిన ఆయ‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ చాలా మంది త‌న‌వంతు సాయాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ స్ట్రీట్‌ పెర్ఫార్మర్‌ ఆయన దృష్టికి రాగా, అతని దశ తిరిగే ఆఫర్‌ ఇచ్చారు ఆనంద్‌ మహీంద్రా. హర్యాణాకి చెందిన వరుణ్‌ యువకుడికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం.

Anand Mahindra Shares beggar dance viral video
Anand Mahindra Shares beggar dance viral video

శబ్ధానికి తగ్గట్టుగా నర్తించడం అంటే ఇష్టం. కానీ అదే అతనికి కష్టాలను కొని తెచ్చింది. సంగీతం, డ్యాన్సులంటూ పని చేయకుండా పరువు తీస్తున్నాడని ఉన్న ఊరూ, కన్న తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో.. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీకి వచ్చేశాడు. అక్కడ కన్నాట్‌ ప్లేస్‌లో ఫుట్‌పాత్‌పై తన కళను ప్రదర్శిస్తూ బతికేస్తున్నాడు.

సంగీతం, డ్యాన్సుల మీద ప్రేమతో నిత్యం కన్నాట్‌ ప్లేస్‌లో ఫుట్‌పాత్‌లపై స్ట్రీట్‌ పెర్ఫార్మర్‌గా వరుణ్‌ ప్రదర్శనలు ఇచ్చేవాడు. బిచ్చగాడిగా భావించిన పోలీసులు బెదిరించే వారు మరికొందరు అరకొర చిల్లర విదిల్చేవారు. ఓ జాతీయ మీడియా సైతం వరుణ్‌పై చిన్న కథనం ప్రసారం చేసింది.

‍స్ట్రీట్‌ పెర్ఫార్మర్‌ ప్రతిభకు ముగ్ధుడయ్యాడు ఆనంద్‌ మహీంద్రా. డ్యాన్స్‌లో మనందరం భాగమే. డ్యాన్స్‌ ద్వారా నీ భావ వ్యక్తీకరణను ఇకపై ఎవ్వరూ ఆపలేరు. అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. వరుణ్‌ డ్యాన్స్‌కి పాటకి ముగ్ధుడై ప్రశంసలతోనే వదిలేయలేదు ఆనంద్‌మహీంద్రా. వరుణ్‌ ప్రతిభకి సరైన వేదిక కల్పించే పనిలో పడ్డారు.

ఢిల్లీలో మహీం‍ద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్‌ ఈవెంట్స్‌లో వరుణ్‌ ప్రోగ్రామ్‌ ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏనాటికైనా బాలీవుడ్‌లో అడుగు పెట్టాలనే వరుణ్‌ కల ఆనంద్‌ మహీంద్రా తోడ్పాటుతో నిజం కావాలని ఆశిద్దాం.