Anand Devarakonda Interesting Comments An Interview : మా అన్న లిప్ కిస్ లు ఇస్తే తప్పేంటి.. ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్లు..!
NQ Staff - July 13, 2023 / 11:05 AM IST

Anand Devarakonda Interesting Comments An Interview
టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ హీరోలుగా బాగానే రాణిస్తున్నారు. విజయ్ దేవరకొండ మాస్, కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. ఆనంద్ మాత్రం కొత్త పంథాలో సినిమాలు చేస్తూ యూత్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరొకండ నటించిన బేబీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
మరికొన్ని రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆనంద్ కు ఓ ప్రశ్న ఎదురైంది. మూవీ లిప్ కిస్ పోస్టర్ లో.. హీరోయిన్ పెదాలపై షుగర్. నోట్లో బ్లేడ్ ఉంటుంది. పక్కనే హీరో లిప్ కిస్ చేయడానికి రెడీగా ఉంటాడు.
అందులో వల్గర్ ఏముంది..?
దీని అర్థం ఏంటి.. ఇందులో లిప్ కిస్ లు ఉన్నాయా.. అలా లిప్ కిస్ చేస్తే ఫీలింగ్ ఏంటి అని ఓ రిపోర్టర్ అడిగారు. దానికి ఆనంద్ స్పందిస్తూ.. ఇందులో లిప్ లాక్ లు ఉన్నాయో లేదో మూవీ చూసి తెలుసుకోవాలి. అసలు లిప్ లాక్ లు అంటే ఎందుకంత వల్గర్ గా ఆలోచిస్తున్నారు. మా అన్నయ్య సినిమాలపై కూడా ఇలాంటి కామెంట్లే వినిపిస్తాయి.
సినిమాలో కొన్ని ఎమోషన్స్ పడటం కోసమే అలాంటి సీన్లు పెడుతారు తప్ప.. అవసరం లేకున్నా అస్సలు పెట్టరు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ సినిమాలో ప్రేమ చాలా కీలకం. ఒక ప్రేమలో ఎన్ని ఎమోషన్లు ఉంటాయో.. అవన్నీ ఇక్కడ చూపించేశాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా అని అన్నారు ఆనంద్.