విజయ్ దేవరకొండ పై నటుడి కామెంట్.. తమ్ముడు కౌంటర్

Admin - October 12, 2020 / 10:26 AM IST

విజయ్ దేవరకొండ పై నటుడి కామెంట్.. తమ్ముడు కౌంటర్

హీరో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్ గా నిలిచిపోయాడు. అయితే తాజాగా విజయ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక విజయ్ వ్యాఖ్యలకు చాలావరకు స్పందించారు. దాంట్లో కొంతమంది విజయ్ కి సపోర్ట్ చేయగా.. మరికొందరు విజయ్ పై సెటైర్లు వేశారు. అలాగే ఒక నటుడు కూడా విజయ్ వ్యాఖ్యలకు కామెంట్ చేసాడు. అయితే గుల్షన్‌ అనే బాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ చేసిన వ్యాఖ్యల పై అసహనం వ్యక్తం చేశారు.

ని తలలో ఉన్న వత్తిడిని తగ్గించడానికి మీకు ఒక హెయిర్ కట్ సూచిస్తా అని ట్వీట్ చేసాడు. ఇక గుల్షన్ పెట్టిన ట్వీట్ కు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కౌంటర్ ఇచ్చాడు. తెలివిగలవాడు ఎవరైనా.. ముందు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడాడో అర్ధం చేసుకుంటాడు. అంతేకాని ఆ వ్యక్తి పై సోషల్ మీడియాలో కామెంట్లు చేయరు అని ఆనంద్ దేవరకొండ ట్వీట్ చేసాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us