Bala Krishna: బాల‌య్య ఉన్న బ‌స్సుపై రాయితో దాడి.. మ‌న లెజెండ్ ఏం చేశారంటే..!

Bala Krishna:నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. చారిత్రాత్మ‌కం, జాన‌ప‌దం, ల‌వ్‌, ఫ్యాక్ష‌న్ ఇలా ఏ జోన‌ర్ అయిన బాల‌య్య త‌న‌దైన శైలిలో దూసుకుపోతూ సినిమాలు చేస్తుంటారు. ఆయ‌న రీసెంట్ కాలంలో న‌టించిన లెజెండ్ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఈ సినిమా సాధించిన విజ‌యంతో చిత్ర బృందం విజ‌యాత్ర చేప‌ట్టింది. బ‌స్సులో అన్ని ప్రాంతాల‌కు తిరుగుతున్న స‌మ‌యంలో ఓ తాగుబోతు బాలయ్య ప్రయాణిస్తున్న బ‌స్సుకి అడ్డంగా వచ్చి.. పెద్ద రాయి తీసుకుని అద్దంపై విసిరాడు. బస్ అద్దం మొత్తం పగిలిపోయింది. అయితే ఆ అద్దానికి వెనుకనే బస్‌లో నిలబడి ఉన్నారు మన లయన్ బాలయ్య బాబు, ఆయన వెనుకనే బోయపాటి గారు కూడా ఉన్నారు. అద్దం పగిలిపోవడంతో వీళ్లిద్దరికీ చిన్న చిన్న గ్లాస్ పీసెస్ కూడా తగిలి గాయాలయ్యాయి.

ఒక్కోసారి సెల్ఫీలు తీస్తుంటేనే ఫైర్ అయ్యే మ‌న బాల‌య్య బాబు ఆ స‌మ‌యంలో చాలా మౌనంగా ఉన్నార‌ట‌. ఈ విష‌యాల‌ని న‌టుడు స‌మీర్ తాజాగా షేర్ చేసుకున్నారు. విజ‌యాత్ర‌లోభాగంగా బ‌స్సు వెళుతుండ‌గా, కొంతమంది అభిమానులు బస్ ఆపారు. అభిమానుల మధ్యలో నుంచి ఒక వ్యక్తి పెద్ద రాయి తీసుకుని వచ్చి బస్ ఫ్రెంట్ అద్దంపై వేసేశాడు. అంద‌రం కంగారు ప‌డ్డాం. డ్రైవ‌ర్ అయితే బ‌స్సు దిగి పారిపోయాడు. బాల‌య్య ఏ మాత్రం క‌ద‌ల్లేదు.

రాయి విసిరిన వ్య‌క్తిని పోలీసుల‌తో పాటు ఊరి జ‌నం కొడుతుండ‌గా, పగిలిపోయిన అద్దం పెంకులపై కాలు పెట్టి.. ‘ఏయ్ వాడ్ని వదిలేయండి.. ఏమీ అనొద్దు.. పాపం వాడు తాగి ఉన్నాడు’ అనడంతో మేమంతా షాక్ అయ్యాం. అదీ ఆయన వ్యక్తిత్వం. అంత పెద్ద గొడవ జరిగిన తరువాత చాలామంది జనం మమ్మల్ని వెంబడించడంతో బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితి.. బౌన్సర్లు ఉన్నా సరే.. వేలాది మంది జనం ఉన్నారు. ఇలాంటి టైంలో ఆ థియేటర్‌కి ఎలా వెళ్తారు బాబుగారూ అని నేను అడిగా. డోర్ తీసి న‌న్ను ట‌పీమ‌ని బ‌య‌ట‌కు తోసారు.

జ‌నంలోకి వెళ్ల‌గానే న‌న్ను కుమ్మేశారు. నా ప‌రిస్థితే ఇలా ఉంటే ఆయ‌న‌కు ఎలాగ ఉందో అని వెన‌క్కి తిరిగా చూశా. జ‌నాలు రెండు పాయ‌లుగా విడిపోయి బాలయ్యకి దారి ఇచ్చేశారు. ఆయన జనానికి చేయి ఊపుతూ హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేశారు. ఒక్కరు కూడా ఆయన దరిదాపుల్లోకి రాలేదు. బౌన్సర్ల అవసరం కూడా రాలేదు. నేను నా కళ్లతో చూసిన విషయం ఇది.. ఆ సీన్ చూసి ఓరి దేవుడా అనుకున్నా’ అంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు నటుడు సమీర్.