Amshala Swamy : ఫ్లోరైడ్‌ బాధితుడు అంశల స్వామి కన్నుమూత.. కేటీఆర్‌ దిగ్భ్రాంతి..!

NQ Staff - January 28, 2023 / 10:13 AM IST

Amshala Swamy  : ఫ్లోరైడ్‌ బాధితుడు అంశల స్వామి కన్నుమూత.. కేటీఆర్‌ దిగ్భ్రాంతి..!

Amshala Swamy  : ఫ్లోరైడ్ బాధితుల ఉద్యమ కారుడు, ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి కన్నుమూశారు. నల్గొండ జిల్లా మునుగోడు లోని శివన్న గూడెంకు చెందిన స్వామి తీవ్ర అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఆయన మృతి పట్ల మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు.

స్వామి కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఫ్లోరోసిస్ బాధితుల కోసం పోరాడిన పోరాట యోధుడని మంత్రి కేటీఆర్ పొగిడారు.

Amshala Swamy Leader Of Fluoride Victims Movement Passed Away

Amshala Swamy Leader Of Fluoride Victims Movement Passed Away

ఆయన పోరాట స్ఫూర్తి ఎంతో మందికి ప్రేరణ అంటూ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. గతంలో ఉద్యమం సమయంలో అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సార్లు స్వామి తన పోరాట ప్రతిమను చూపించాడు. ఆయన చేసిన పోరాటం కారణంగానే ఈరోజు నల్లగొండ జిల్లాలో చాలామందికి న్యాయం జరిగిందని ప్రచారం. స్వామి మృతిపట్ల చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us