మర్డర్ మూవీ విడుదలను ఆపాలని వర్మకు నోటీసులు జారీ చేసిన అమృత
Admin - August 5, 2020 / 10:39 AM IST

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ ప్రారంభం నుండి కూడా నిజ జీవిత సంఘటన ఆధారంగా మూవీస్ తీస్తూ ఉన్నాడు. ఆయన తీసే మూవీస్ వల్ల నిత్యం ఆయన చుట్టూ వివాదాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన తీస్తున్న మర్డర్ చిత్రంపై కూడా ప్రారంభ దశ నుండే వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీని మిర్యాలగూడలో జరిగిన అమృత ప్రణయ్ ల సంఘటనల ఆధారంగా తిస్తున్నానని వర్మ ప్రకటించాడు. అయితే తాజా ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్ ను, పాటను విడుదల చేశారు.
అయితే ఈ మూవీ తమ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించారని, ఈ చిత్రం ద్వారా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, తమ అనుమతి తీసుకోకుండా ఎలా తీస్తారని గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగా ఇలా మూవీస్ తీయడం వల్ల సాక్షాదారులపై ప్రభావం పడుతుందని అమృత తెలిపారు. ఈ కేస్ ను విచారించిన ఎస్సీ, ఎస్టీ కోర్ట్ న్యాయమూర్తి రామ్ గోపాల్ వర్మ, నట్టి కుమార్ లకు నోటీసులు జారీ చేస్తూ కేస్ ను ఈనెల 6వ తేదీకి వాయిదా వేశారు. ఈ నోటీసులను వాట్సప్ ద్వారా అమృత లాయర్ ఆర్జీవికి, నిర్మాత నట్టి కుమార్ కు పంపారు. దీనిపై వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అమృత కేస్ వేయడానికంటే ముందే అమృత అనుమతి తీసుకున్నారా అని ఒక ఇంటర్ వ్యూలో అడిగిన ప్రశ్నకు వర్మ సమాధానమిస్తూ… పబ్లిక్ డొమైన్ లో ఉన్న అంశంపై మూవీ తీసే హక్కు ఎవరికైనా ఉంటుందని, దానికి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని, నేను ఆ. ఘటన ఆధారంగా మూవీ తీస్తున్నానే కానీ అమృతా ప్రణయ్ ల బయోపిక్ తీయడం లేదని, అందుకే వల్ల అనుమతి తీసుకోవడం లేదని తెలిపారు.