Amritha Aiyer : అందం, ‘అమృతం’.! కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న భామ.!

NQ Staff - November 14, 2022 / 10:27 PM IST

Amritha Aiyer : అందం, ‘అమృతం’.! కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న భామ.!

Amritha Aiyer : అమృతా అయ్యర్.. ఈ పేరు గుర్తుందా.? పోనీ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’ అనే ఓ సినిమా వచ్చింది. అదయినా గుర్తుందా.? అదేనండీ బుల్లితెర మేల్ యాంకర్ ప్రదీప్ మాచినేని హీరోగా ఓ సినిమా తెరకెక్కింది కదా.. అప్పట్లో.

ఆ సినిమాలో ప్రదీప్‌కి జంటగా నటించిన ముద్దుగుమ్మే అమృతా అయ్యర్. నేచురల్ బ్యూటీగా ఈ సినిమాలో తెగ నటించేసింది ఈ భామ. ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి.. అమృతా అయ్యర్ నటనకు మార్కులు బాగానే వేయించుకుంది లెండి.

 

నేచురల్ బ్యూటీ విత్ గ్లామర్.!

ఆ తర్వాత మరే ఇతర సినిమాల్లోనూ కనిపించలేదు. కానీ, చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా వుంది. తాజాగా ‘కాఫీ విత్ కాదల్’ అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అమృతా అయ్యర్.

ఈ సినిమా ప్రమోషన్ల నిమిత్తం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోందీ క్యూట్ బ్యూటీ. అన్నట్లు తెలుగులో ‘హనుమాన్’ అనే సినిమాలో నటిస్తోంది. సూపర్ పవర్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు.

ఇవే కాదు, వీటితో పాటూ, పలు తెలుగు, తమిళ ప్రాజెక్టుల్ని టేకప్ చేసింది అమృతా అయ్యర్. ఆయా ప్రాజెక్టులతో బిజీగా వుంటూనే సోషల్ మీడియాలోనూ పిచ్చ యాక్టివ్‌గా వుంటుంది అమృతా అయ్యర్. తాజాగా అమృతా అయ్యర్ ఫోటోలు కొన్ని నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయ్. మీరూ ఆ పిక్స్‌పై ఓ లక్కేసేయండి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us