కరోనా ను జయించిన అమిత్ షా

Advertisement

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన అప్పటినుంచి ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఆ తర్వాత గుర్గావ్‌ లోని మేదాంత ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ జరిగింది. అయితే తాజాగా ఆయన ఆ ఆసుపత్రి నుంచి డిస్ ఛార్జ్ అయ్యారు. అయితే 14వ తేదీనే ఆయనకు కరోనా టెస్టులు చేయగా, నెగిటివ్ వచ్చింది. దీనితో కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు.

అలా డిశ్చార్జి అయ్యిన తరువాత అమిత్ షా కు అలసట, ఒళ్లు నొప్పులు సంభవించాయి. అయితే అన్ని రోజులు ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల ఇలా అవుతుంది అనుకున్నాడు. వెంటనే మరోసారి ఆగష్టు18వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స కోసం చేరారు. ఇక డాక్టర్లు పోస్ట్ కొవిడ్ కేర్ అని నిర్దారణ చేసారు. ఇక ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించింది. ఇక ఈ క్రమంలో ఆయనను ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here