అమిత్ షాతో మాట్లాడిన చంద్రబాబు, బీజేపీతో పొత్తు పెట్టుకొనున్నారా!

Advertisement

2019 ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బాబు ఇప్పుడు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ నేత అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా మరోసారి ఎయిమ్స్ లో చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై పరామర్శ చేయడానికి చంద్రబాబు ఫోన్ చేశారు.

ఆయన ఆరోగ్య విషయమై పరమర్శిస్తూనే పొత్తు గురించి కూడా మాట్లాడారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ ఫోన్ కాల్ తరువాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారని సమాచారం. రానున్న ఎన్నికల్లో జగన్ ను దెబ్బతీయడానికి బాబు ఈ వ్యూహాలు రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై వైసీపీ నాయకులు స్పందిస్తూ …చంద్రబాబు నాయుడు ఇలా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా వైసీపీని ఓడించలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here