కరోనా వైరస్ యొక్క బలహీనతలను కనుగొన్న పరిశోధకులు

Advertisement

కరోనాపై పోరాడటానికి ప్రపంచం మొత్తం ప్రయత్నిస్తుంది. రష్యా ఇప్పటికే కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన విషయ తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ పై కొంతమంది పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని దేశాలు మాత్రం కరోనా వైరస్ లో ఉన్న బలహీనతలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని నార్త్ వెస్టర్న్. యూనివర్సిటీ పరిశోధకులు వైరస్ కు సంబంధించిన కొన్ని బలహీనతలను కనుగొన్నారు.

మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశించడానికి స్పైక్ ప్రోటీన్ ను వాడుకుంటుందని మొదట్లో పరిశోధకులు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ ప్రోటీన్ కణానికి అంటుకొనే ప్రాంతానికి కొన్ని నానో మీటర్స్ దూరంలో ఒక చీలిక లాంటిది ఏర్పడిందని, ధనావేశం కలిగిన ఈ కణాలకు ఋణవేశం కలిగిన పరమాణువులు జోడిస్తే వైరస్ ప్రభావం తగ్గినట్టు తాము గుర్తించామని పరిశోధకులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here