అమెరికా ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా ఇవాంక బాగుంటుంది: ట్రంప్

Advertisement

అమెరికాలో ఎన్నికల పోరు మొదలైంది. నవంబర్ లో జరగనున్న ఎన్నికల కోసం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ…అమెరికా ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా తన కుమార్తె ఇవాంక అయితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి కమలా హారీస్‌పై విమర్శలు చేస్తున్న సమయంలో ఇవాంక దేశ అధ్యక్షురాలు కావాలన్న భావనను బయటపెట్టారు. కమలా హారీస్‌ అసమర్థురాలు. ఉన్నత పదవులకు సరిపోరు. నేను కూడా దేశానికి ఓ మహిళ అధ్యక్షురాలిగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే కమలాహారీస్‌ లాంటి వారు కాదని వెల్లడించారు.

కమలాహారీస్‌ తొలుత డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేశారని, అయితే పార్టీలో మద్దతు లేకపోవడంతో తప్పుకొని, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని, సొంత పార్టీలోనే మద్దతు కూడగట్టుకోలేని కమలా ఉన్నత పదవులకు సరిపోరని ట్రంప్ వెల్లడించారు. కమలా హారీస్ భారత సంతతికి చెందిన మహిళ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here