అనారోగ్యంతో డోనాల్డ్ ట్రంప్ సోదరుడు మృతి

Advertisement

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క సోదరుడు రాబర్ట్ ట్రంప్ అనారోగ్యంతో కన్ను మూశారు. ఈ విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాబర్ట్ ట్రంప్ గత కొంత కాలంగా అనారోగ్యముతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో మృతి చెందారని ట్రంప్ వెల్లడించారు. బరువెక్కిన్న హృదయంతో ఈ చెప్తున్నానని, తాను తన సోదరుడిని మాత్రమే కాకుండా ఒక మిత్రుడిని కూడా కోల్పోయానని వెల్లడించారు. రాబర్ట్ ఆరోగ్యం క్షిణించడంతో డోనాల్డ్ ట్రంప్ హాస్పిటల్ కు వెళ్లి చివరిసారిగా పరామర్శించారు. రాబర్ట్‌ వాల్‌స్ట్రీట్‌ బిజినెస్‌లో అడుగులు వేసి, అనంతరం కుటుంబ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించారు.

ట్రంప్ నవంబర్ నెలలో రానున్న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం ట్రంప్ ను మానసికంగా క్రుంగదిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన ప్రత్యర్థులు కూడా విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here