America: అమెరికాను వ‌ణికిస్తున్న డెల్టా వేరియెంట్‌.. 80 శాతం అవే కేసులంటున్న సీడీసీ

America: చూస్తుంటే క‌రోనా ఎఫెక్ట్ ఇప్ప‌ట్లో పోయేలా క‌నిపించ‌డం లేదు. తొలి ద‌శ‌లోనే క‌రోనా పోయింద‌ని అంతా భావించారు. కాని మ‌ళ్లీ సెకండ్ వేవ్ మొద‌లైంది. సెకండ్ వేవ్ వ‌ల‌న చాలా మంది క‌న్నుమూసారు. ఇక థ‌ర్డ్ వేవ్ విజృంభ‌ణ కూడా మొద‌లైంది. థ‌ర్డ్ వేవ్ లో డెల్టా వేరియెంట్ బుస‌లు కొడుతుంది. అమెరికాలో ఈ వేరియెంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతుంది. ఇత‌ర వేరియెంట్స్ క‌న్నా డెల్టా వేరియెంట్ ప్ర‌మాదక‌రంగా మారుతుందని శాస్త్ర‌వేత్త‌లు నిర్ధారించారు.

డెల్టా వేరియెంట్ చిన్న పిల్ల‌ల‌పై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతుంది. అమెరికాలో వచ్చే కొత్త కేసులో 80 శాతం కంటే అధికంగా డెల్టా వేరియెంట్ కేసులు వ‌స్తున్నాయి. మిస్సోరీ, కేన్స‌స్,అయోవా రాష్ట్రాల‌లో 80 శాతం కేసులు డెల్టా వేరియెంట్ అని అమెరికా వ్యాధి నియంత్ర‌ణ‌, నిర్మూల‌న కేంద్రం(సీడీసీ) చెబుతుంది. టీకా వేయించుకోని వారిలో డెల్టా ర‌కం వైర‌స్ ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు.

డెల్టా వేరియెంట్ సంక్ర‌మ‌ణ అధిక‌మ‌ని దీనిని తీవ్ర‌మైన‌దిగా ప‌రిగ‌ణ‌ఙంచాల‌ని అన్నామోరీ డేవిడ్ స‌న్ అనే వైద్య నిపుణుడు తెలియ‌జేశారు. గాల్వెస్ట‌న్ కౌంటీ ఆరోగ్య శాఖ‌వివ‌రాల ప్ర‌కారం ఆ జిల్లాలో 450 కేసుల‌లో 6 నుండి 12 ఏళ్ల మ‌ధ్య వయ‌స్సు ఉన్న‌చిన్నారుల‌లో 57 మంది డెల్టా బారిన ప‌డ్డారు. ఈ క్ర‌మంలో చిన్నారుల‌తో బ‌హిరంగ ప్ర‌దేశాల‌కి, ప్రార్ధ‌నా మందిరాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

చిన్నారులు, యువ‌కులు డెల్టా బారి ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుది. డెల్టా సోకితే ఆసుప‌త్రిలోనే చికిత్స పొందాల్సి ఉంటుంది. తీవ్ర‌మైన శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ట‌. రెండేళ్ల దాటిన చిన్నారులు త‌ప్ప‌క మాస్క్‌లు ధ‌రించేలా చూడ‌డంతో పాటు 20 అడుగుల భౌతిక దూరం ఉండేలా చూసుకుంటే డెల్టా వేరియెంట్ బారిన ప‌డ‌క‌పోవ‌చ్చు. క‌రోనా స్పైక్ ప్రోటీన్‌లో ఉత్ప‌రివ‌ర్త‌నం కార‌ణంగానే డెల్టా అధికంగా వ్యాప్తి చెందుతుంద‌ని అంటున్నారు.

వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ని వీలైనంత మేరకు త్వ‌రగా పూర్తి చేయాల‌ని లేదంటే రానున్న రోజుల‌లో మ‌రిన్ని ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్పుకొస్తున్నారు.