Ambulance Driver : షాకింగ్.! ‘పెగ్గు’ కోసం ఎంతకు దిగజారాడు ఈ అంబులెన్స్ డ్రైవర్.!
NQ Staff - December 21, 2022 / 07:42 PM IST

Ambulance Driver : ప్రాణాపాయ స్థితిలో వున్నప్పుడు ముందుగా గుర్తొచ్చే పేరు అంబులెన్స్. సరైన సమయంలో దుర్ఘటనలు జరిగిన చోటుకి రెప్పపాటు కాలంలో చేరుకుని, పేషెంట్‌కి ప్రాణ భిక్ష పెట్టడంలో అంబులెన్సుల పాత్ర మాటల్లో చెప్పలేనిది.
ఈ ప్రక్రియలో అంబులెన్స్ డ్రైవర్‌ది అత్యంత కీలకమైన పాత్ర. చాలా బాధ్యతగా వ్యవహరించాల్సి వుంటుంది అంబులెన్స్ డ్రైవర్. కానీ, ఓ అంబులెన్స్ డ్రైవర్ మద్యం తీసుకుని వాహనాన్ని నడపడమే కాకుండా, మద్యం కోసం అంబులెన్స్‌ని రోడ్డుపైనే ఆపేసి తాను ఓ పెగ్గు తీసుకుని, పేషెంట్‌కీ ఓ పెగ్గు పోసిన ఘటన తాజాగా ఒడిశాలో చోటు చేసుకుంది.
నా కోసం కాదంటూ ప్లేటు ఫిరాయింపు…
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలికి తీవ్ర గాయం కావడంతో అంబులెన్స్ ఎక్కాడు ఓ పేషెంట్. ఆయన పక్కనే భార్య, ఓ చిన్న పిల్లాడు కూడా వున్నారు.
కట్ చేస్తే, అంబులెన్స్ డ్రైవర్ మద్యం సేవించి వున్నాడు. మార్గ మధ్యంలో మద్యం బాటిల్ కోసం అంబులెన్స్‌ని హైవేపై నిలిపేసి, తనతో పాటూ, పేషెంట్‌కీ మద్యం పోశాడు. అంబులెన్స్ డ్రైవర్ చర్యను అక్కడి స్థానికులు వారించడంతో వారితో వాగ్వాదానికి దిగాడు.
ఈ ఘటనంతటినీ అక్కడి కొందరు కుర్రాళ్లు సెల్ఫోన్లో చిత్రీకరించి నెట్టింట్లో అప్లోడ్ చేశారు. బాధ్యతా రహితంగా ప్రవర్తించిన అంబులెన్స్ డ్రైవర్‌కి తగిన శిక్ష విదించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆరా తీయగా, తప్పు పేషెంట్ మీదికి నెట్టే ప్రయత్నం చేశాడీ మగానుభావుడు.!