ఇటువంటి డెలివరీ బాయ్స్ కూడా ఉంటారా? కస్టమర్ ను ఎలా మోసం చేశాడో తెలుసా?
Ajay G - October 21, 2020 / 02:00 PM IST

అసలే పండుగ కాలం.. మరోవైపు కరోనా కాలం. కస్టమర్లు చాలామంది ఆన్ లైన్ లోనే షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్న కాలం ఇది. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు కొందరు డెలివరీ బాయ్స్. కస్టమర్లను బురిడి కొట్టిస్తూ.. అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. చివరకు వాళ్ల సంగతి తెలిశాక కటకటాలపాలు అవుతున్నారు.

amazon delivery boy cheats customer
తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకున్నది. అమెజాన్ లో ఓ వ్యక్తి మొబైల్ ను బుక్ చేసుకున్నాడు. అక్టోబర్ 1కే ఆ ఫోన్ డెలివరీ కావాలి. కానీ.. టైమ్ దాటిపోయినా ఇంకా మొబైల్ డెలివరీ కాకపోవడంతో.. డెలివరీ బాయ్ కి ఫోన్ చేశాడు ఆ కస్టమర్.
దీంతో.. కస్టమర్ చేసిన ఆర్డర్ క్యాన్సల్ అయిందని.. డబ్బులు తిరిగి అకౌంట్ లో పడుతాయని నమ్మబలికాడు ఆ డెలివరీ బాయ్. దీంతో నిజమే అని ఆ కస్టమర్ అనుకున్నాడు. కానీ.. ఈ డెలివరీ బాయ్ ఏం చేశాడంటే.. ఆ కస్టమర్ కు డెలివరీ చేయాల్సిన ఫోన్ ను అమ్మేసుకున్నాడు. డెలివరీ చేయలేదు.

amazon delivery boy cheats customer
అయితే.. ఆ కస్టమర్ మొబైల్ కు మొబైల్ డెలివరీ అయిందని మెసేజ్ రావడంతో కంగుతిన్న కస్టమర్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆ ఏరియా డెలివరీ బాయ్ ని పట్టుకొని విచారించగా.. తానే మొబైల్ ను అమ్మేసినట్టు ఒప్పుకున్నాడు.