Amala Comments On Naga Chaithanya : చైతూ చాలా బ్రిలియంట్.. అతనికి ఎవరు కావాలో బాగా తెలుసు.. అమల కామెంట్లు..!

NQ Staff - June 24, 2023 / 11:36 AM IST

Amala Comments On Naga Chaithanya : చైతూ చాలా బ్రిలియంట్.. అతనికి ఎవరు కావాలో బాగా తెలుసు.. అమల కామెంట్లు..!

Amala Comments On Naga Chaithanya : అక్కినేని అమల పెద్దగా బయటకు రాదు. వీలైనంత వరకు తన ఫౌండేషన్ పనులు చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా సినిమాల్లో ఛాన్స్ వస్తే నటిస్తుంది. అంతే తప్ప పెద్దగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వదు. ఇక చైతూ గురించి ఆమె మాట్లాడే సందర్భాలు కూడా చాలా తక్కువ. అయితే తాజాగా ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది.

తాజాగా అక్కినేని అమల జర్నలిస్ట్ ప్రేమ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చైతూ గురించి ఒక్క మాటలో చెప్పమంటే మీరేం చెబుతారు అంటూ ప్రేమ అడిగింది. దానికి అమల స్పందిస్తూ.. అతను చాలా బ్రిలియంట్ పర్సన్. చాలా తెలివైన వాడు. అతనికి ఏం కావాలో అతనికి బాగా తెలుసు.

అనుకున్నది సాధించేందుకు చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇలా చైతూని ప్రశంసలతో ముంచెత్తడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చైతూ అభిమానులు ఈ వ్యాఖ్యలతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అఖిల్ గురించి కూడా చెప్పింది అమల. అఖిల్ కు మనుషులంటే చాలా ఇష్టం.

హ్యూమన్ లవబుల్ పర్సన్ అతను. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆమె అఖిల్ కంటే ఎక్కువగా చైతూ గురించే మాట్లాడటం విషేశం. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతోంది. ప్రస్తుతం చైతూ ఒక్కటే సెపరేటుగా ఉంటున్నాడని తెలుస్తోంది. అతను ఇప్పుడు కొత్త ఇంటిని డిజైన్ చేయించుకుంటున్నాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us