Allu Arjun : బడా హిందీ మూవీని రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్.. ఫ్యాన్స్ హర్ట్..!
NQ Staff - March 2, 2023 / 02:20 PM IST

Allu Arjun : పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియాను తాకుతోంది. నేషనల్ వైడ్ గా ఆయనకు ఫుల్ పాపులారిటీ ఉంది. ఆయన సినిమాలను ఇతర భాషల్లో కూడా చూస్తారు. అందుకే ఆయన తన తర్వాత ప్రాజెక్ట్ పుష్ప-2 సినిమా మీద పూర్తి స్థాయి ఏకాగ్రతతో పని చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది.
ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీ కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు బన్నీ. అందుకే ఈ మూవీ అయిపోయేంత వరకు ఇంకో మూవీలో నటించేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన వద్దకు ఓ బడా ఆఫర్ వచ్చింది.
డేట్లు ఖాళీగా లేవని..

Allu Arjun Rejected Guest Role In Jawan Movie
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వస్తున్న మూవీ జవాన్. ఇందులో గెస్ట్ రోల్ ఒకటి ఉంది. అందులో నటించాల్సిందిగా అల్లు అర్జున్ ను కోరాడంట దర్శకుడు. కానీ తన డేట్లు ఖాళీగా లేవని సున్నితంగా తిరస్కరించాడు బన్నీ. ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. బన్నీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. అలాంటిది ఏకంగా షారుఖ్ మూవీ నుంచి పరిచయం అయితే ఇంకో లెవల్ లో ఉంటుందని చెబుతున్నారు. చూడాలి మరి అల్లు అర్జున్ వేరే మూవీతో అయినా ఫ్యాన్స్ కోరిక తీరుస్తారో లేదో.