ALLU ARJUN: రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే!

అల్లు అర్జున్‌కు రికార్డులు కొత్త కాదు. ప్ర‌తి సినిమాతో సెన్సేష‌న్స్ క్రియేట్ చేసే అల్లు అర్జున్ తాజాగా పుష్ప సినిమాతో కూడా రికార్డుల ప్ర‌భంజ‌నం మొద‌లు పెట్టాడు. ఏప్రిల్ 7 బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా పుష్ప టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, ఈ టీజ‌ర్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించింది. అల్లు అర్జున్ మాస్ గెట‌ప్, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం, సుకుమార్ టేకింగ్ స్టైల్ టీజ‌ర్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. తాజాగా ఈ టీజర్‌ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను అందుకోగా 1.2 మిలియన్‌ లైక్స్‌ను సంపాదించింది. అత్యంత తక్కువ సమయంలోనే 50 మిలియన్ల వ్యూస్‌ మార్క్‌ను చేరుకున్న తెలుగు టీజర్‌గా ‘పుష్ప’ రికార్డుకెక్కింది.

ఆర్‌ఆర్‌​ఆర్‌లోని రామరాజు ఫర్‌ భీమ్‌ వీడియో 50 మిలియన్ల వ్యూస్‌ను చేరుకునేందుకు 6 నెలలు పట్టగా, బన్నీ మాత్రం కేవలం 20 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. చిత్రాన్ని ఆగ‌స్ట్ 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేయ‌గా, క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫజల్ విలన్‌గా కనిపించనున్నాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

Advertisement