స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పంథా మార్చాడు. ఇన్నాళ్ళు తన ప్రతి సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపించి అలరించిన బన్నీ ఇప్పుడు డీ గ్లామరస్ పాత్రలకు సై అంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా కోసం లారీ డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఈ మూవీకి సంబంధించి బన్నీ లుక్ ఇప్పటికే విడుదల కాగా, ఇది నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కొరటాల శివ మూవీలోను డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్నాడట.
అల్లు అర్జున్ కెరీర్లోనే ఎన్నటికీ గుర్తుండిపోయేలా ఆయన కోసం ప్రత్యేకంగా బలమైన కథ రెడీ చేస్తున్నారట కొరటాల శివ. సామాజిక కోణంలో ఈ కథ సాగనుందని తెలుస్తుంది. బలమైన సోషల్ మెసేజ్‌తో చిత్రాన్ని తెరకెక్కించాలని కొరటాల భావిస్తుండగా, ఇందులో కథానాయికగా సాయి మంజ్రేకర్ నటించనుందని టాక్.ఈ సినిమా బన్నీ కెరియర్లో మైలు రాయిగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తుంది. చూడాలి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో మరి..!