Urvasivo Rakshasivo Movie : ‘ఊర్వశివో రాక్షసివో’.! హిట్టు అనిపించేసుకున్నట్టేనా.?
NQ Staff - November 7, 2022 / 01:33 PM IST

Urvasivo Rakshasivo Movie : అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రూపొందిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా, అనూ ఇమ్మాన్యుయేల్ బాగానే చేసిందన్న టాక్ అయితే వచ్చింది.
ఎంతైనా ప్రముఖ నటుడు అల్లు అరవింద్ తనయుడు కదా, అందుకే.. అల్లు శిరీష్ సినిమాని.. జాగ్రత్తగా పైకి లేపేందుకు ప్రయత్నాలు గట్టిగానే జరిగాయ్.. ఇంకా జరుగుతూనే వున్నాయ్. తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ సినిమా ప్రమోషన్ల కోసం రంగంలోకి దిగేశాడు.
సినిమా హిట్టే.. శిరీష్ కొట్టేశాడంతే..
‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా హిట్టయ్యింది.. అల్లు శిరీష్ హిట్ట కొట్టేశాడు.. ఇలా అనిపించేసింది ఎట్టకేలకు అల్లు కాంపౌండ్. సినిమా సక్సెస్ ఫంక్షన్ కూడా నిర్వహించేశారు.. అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు కూడా.
కానీ, థియేటర్లలో జనమేరీ.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. ఫ్యామిలీస్ ఈ సినిమా వైపు కన్నెత్తి చూడటంలేదు. యూత్ ఈ సినిమాని లైట్ తీసుకున్నారు. నిజానికి, ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమా ఇది. పేరు మార్చుకుని ఎలాగైతనేం థియేటర్లలోకి వచ్చింది.
‘ప్రేమ కాదంట’ సినిమా కాస్తా ‘ఊర్వశివో రాక్షిసివో’ అయ్యింది. సినిమా నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారోగానీ, ‘మా సినిమా హిట్టే..’ అనిపించుకోవడానికి గట్టిగా ఖర్చు చేయాల్సి వస్తోందిట.