Allu Arjun : పవన్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు.. గొడవలు ముగిసినట్టేనా..?
NQ Staff - January 30, 2023 / 03:15 PM IST

Allu Arjun : పవన్ కల్యాణ్ ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటు పోతున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కాగా ఇప్పుడు హరిమర వీరమల్లు సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ఆయన చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి.
అందులో హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేసే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఒకటి. ఈ మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులే అవుతుంది. కానీ ఇంకా పట్టాలెక్కలేదు. కానీ త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇందులో ముందుగా పూజాహెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె ఇందులో నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఆ కథ ఆధారంగా..
త్వరలోనే మరో హీరోయిన్ ను ఇందులోకి తీసుకోబోతున్నారంట. కాగా ఈ సినిమాను తమిళ్ లో విజయ్ చేసిన థేరి సినిమాకు రీమేక్ గా చేస్తున్నారంట. కథ మొత్తం కాకపోయినా అందులో చాలా సీన్లను ఆధారంగా చేసుకుని ఈసినిమాను చేస్తున్నారు. ఇందులో కూతురు, ఓ మహిళ సెంటిమెంట్ బాగా ఉంటుంది.
కాగా పవన్ కల్యాణ్ కూతురుగా అల్లు అర్జున్ కూతురు అర్హ నటించబోతున్నట్టు తెలుస్తోంది. విజయ థేరి సినిమాలో విజయ్ కూతురుగా మీనా కూతరు నటించింది. కాబట్టి భగత్ సింగ్ మూవీలో అర్హ నటిస్తే బాగుంటుందని హరీశ్ శంకర్ చెప్పాడంట. పవన్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అదే జరిగితే పవన్ కు, బన్నీకి మధ్య ఉన్న గ్యాప్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది.