Allu Arjun : నా మొదటి లవర్ పేరు శృతి.. స్నేహారెడ్డికి షాక్ ఇచ్చిన బన్నీ..!
NQ Staff - May 30, 2023 / 11:44 AM IST

Allu Arjun : అవును.. ఇప్పుడు మీరు విన్నది నిజమే. అల్లు అర్జున్ తన మొదటి ప్రేయసి పేరు శృతి అని షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఆయన ఎన్నడూ బయట పెట్టలేదు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డితో ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. మొదట్లో వీరిద్దరూ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత ఫోన్ నెంబర్స్ ఛేంజ్ చేసుకుని దగ్గరయ్యారు. అనంతరం ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని పెండ్లి వరకు వెళ్లారు. కాగా ఇప్పటి వరకు అందరికీ తెలిసింది ఏంటంటే.. అల్లు అర్జున్ కేవలం స్నేహారెడ్డిని మాత్రమే ప్రేమించి పెండ్లి చేసుకున్నాడేమో అని అనుకున్నారు. కానీ అది నిజం కాదంట.
తాజాగా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సీజన్-2 కు గెస్ట్ గా వచ్చిన బన్నీ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ ప్రోగ్రామ్ లో శృతి అనే సింగర్ బన్నీ సాంగ్ అయిన ‘పిలగా నువు ఇరగ ఇరగ’ సాంగ్ గొప్పగా పాడింది. దాంతో అల్లు అర్జున్ ఆమెను చాలా మెచ్చుకున్నాడు. శృతి అనే పేరు అంటే నాకు చాలా ఇష్టం.
ఎందుకంటే నా మొదటి లవర్ పేరు శృతి అంటూ నోరు జారాడు. దాంతో షోలో అందరూ షాక్ అయిపోయారు. ఇది విన్న నెటిజన్లు నిజమే కావచ్చు.. అల్లు స్నేహారెడ్డికి బన్నీ షాక్ ఇచ్చాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ శృతి అనే అమ్మాయితో బన్నీ ఎప్పుడు ప్రేమాయణం నడిపించాడో తెలియాల్సి ఉంది.