Allu Arjun Become Pan India Star : నితిన్ చేసిన తప్పు వల్లే బన్నీ స్టార్ హీరో అయ్యాడా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!
NQ Staff - July 5, 2023 / 11:12 AM IST

Allu Arjun Become Pan India Star :
ఇప్పుడు అల్లు అర్జున్ ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దెబ్బకు ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు పుష్ప-2 సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ కోసం భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. అయతే బన్నీ ఇలా స్టార్ హీరోగా మారడానికి కారణం నితిన్ అని తెలుస్తోంది.
బన్నీకి స్టార్ హీరోను చేసిన మూవీ ఆర్య. ఈ సినిమాతోనే ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దీనికి డైరెక్టర్ గా వ్యవహరించాడు సుకుమార్. అయితే ఈ కథను ముందుగా నితిన్ ను ఊహించుకుని రాసుకున్నాడు సుకుమార్. జయం సినిమాతో మంచి హిట్ కొట్టి.. యూత్ కు బాగా దగ్గరయ్యాడు నితిన్.
ఆ కథ చెప్పడంతో..

Allu Arjun Become Pan India Star
ప్రేమ కథ సినిమాలకు ఆయన బాగా సెట్ అవుతాడనే నమ్మకంతో ఈ కథను నితిన్ కు వినిపించాడంట సుకుమార్. కానీ జయం హిట్ తో ఆయన చేతినిండా సినిమాలు వచ్చేశాయి. సుకుమార్ నితిన్ ను కలిసే సమయానికే నాలుగు సినిమాలతో బిజీగా మారిపోయాడు నితిన్. కాబట్టి సుకుమార్ సినిమాను ఇప్పట్లో చేయలేనని చెప్పాడు నితిన్.
దాంతో ఇదే కథను అల్లు అర్జున్ కు వినిపించాడు సుకుమార్. ఆ తర్వాత అల్లు అరవింద్, చిరంజీవికి కూడా వినిపించాడు. అరవింద్, చిరంజీవి ఓకే చేయడంతో ఈ కథ పట్టాలెక్కింది. ఈ మూవీ యూత్ ను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దెబ్బకు అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఒకవేళ ఆ సినిమా నితిన్ చేసి ఉంటే ఇప్పుడు ఆయన కూడా స్టార్ హీరో అయ్యేవాడేమో.