Allu Arjun: పెళ్లి వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారిన అల్లు అర్జున్..!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేశారు. టాలీవుడ్ పీఆర్ఓ ఏలూరు శ్రీను పెళ్లి వేడుకకు వైట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో హాజ‌రైన బ‌న్నీస్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. బ‌న్నీ రాక‌తో అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. బ‌న్నీతో ప‌లువురు సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు.

Allu Arjun As Special Attraction In the Marriage
Allu Arjun As Special Attraction In the Marriage


ఏలూరు శీను ఎప్ప‌టి నుండో టాలీవుడ్ పీఆర్ఓ గా ప‌ని చేస్తున్నారు. ఆయ‌నకు తెలుగు హీరోల‌తో మంచి అనుబంధం ఉంది. ఈ క్ర‌మంలో ఆయ‌న పెళ్లికి అల్లు శిరీష్‌, నిఖిల్, సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో పాటు బ‌న్నీవాసు,ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు హాజ‌ర‌య్యారు.

Allu Arjun As Special Attraction In the Marriage
Allu Arjun As Special Attraction In the Marriage


అల్లు అర్జున్ ఒక‌వైపు పుష్ప సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ వీలు చూసుకొని పెళ్లికి వెళ్ల‌గా,ఆయ‌న‌కు బ‌న్నీతో ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్ధ‌మవుతుంది.బ‌న్నీ న‌టిస్తున్న పుష్ప సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానుంది. ఈ రోజు ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ అధికారిగా.. కంటిచూపుతోనే అందర్నీ గజగజ వణికించేలా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు.

Allu Arjun As Special Attraction In the Marriage
Allu Arjun As Special Attraction In the Marriage


ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రమిది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ-సుక్కు కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక.


మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.