Allu Arha New Movie Update : నిముషానికి రూ.2 లక్షలు.. అప్పుడే తండ్రిని మించి సంపాదిస్తున్న అల్లు అర్హ..!
NQ Staff - July 16, 2023 / 11:11 AM IST

Allu Arha New Movie Update :
అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నారు. రాజమౌళి లాంటి బడా డైరెక్టర్ సపోర్ట్ లేకపోయినా సరే ఆయన పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు. ఇప్పుడు పుష్ప-2 సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉంటున్నాడు బన్నీ. ఇక ఆయన కూతురు అల్లు అర్హ గురించి అందరికీ తెలిసిందే.
ఇప్పటికే అర్హకు సంబంధించిన వీడియోలు ఎంతగానో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన మరో న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో అల్లు అర్హను తీసుకుంటున్నారంట. ఇందులో జాన్వీకపూర్ చిన్నప్పటి పాత్రలో అర్హను అడిగారంట.
ఎన్టీఆర్ సినిమాలో..

Allu Arha New Movie Update
కొరటాల శివ సజెస్ట్ చేయడంతో ఎన్టీఆర్ స్వయంగా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి అడిగాడంట. దాంతో అల్లు అర్జున్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. ఈ సినిమాలో ఆమె పాత్ర 10 నిముషాల పాటు ఉండబోతోంది. ఈ పాత్ర కోసం ఆమెకు రూ.20లక్షల వరకు ఇస్తున్నారంట.
అంటే ఒక నిముషానికి రూ.2లక్షలు అన్నమాట. ఇంత మొత్తంలో స్టార్ హీరోలు కూడా తీసుకోవట్లేదు. కానీ ఈ రేంజ్ లో ఇవ్వడానికి కారణం అల్లు అర్జున్ కూతురు కాబట్టి ఆ క్రేజ్ కూడా కలిసి వస్తుందని ఇలా ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పటికే ఆమె శాకుంతలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.